కరేలా జామున్ జ్యూస్ యొక్క విశిష్టత మరియు ఉపయోగాలు :
డయాబెటిస్ ఇప్పుడు అందరి నోటా అదే మాట . డయాబెటిస్ అసలు ఎందుకు వస్తుంది ? కారణాలు ఏంటి ఇలాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం
డయాబెటిస్ మెల్లిటస్, సాధారణంగా డయాబెటిస్ అని పిలుస్తారు, ఇది రక్తంలో చక్కెరను కలిగించే జీవక్రియ వ్యాధి, ,ఒక వ్యక్తి శరీరం లో ఇన్సులిన్ స్థాయిలు తక్కువ గా ఉన్నపుడు షుగర్ వ్యాధి గా నిర్థారిస్తారు .
మధుమేహం అనేది ఈ రోజ్జుల్లో సర్వసాధారణం అయిపోయింది. ప్రపంచం లో దాదాపు 13 నుండి 14 కోట్ల మంది డయాబెటిస్ కి గురి అవుతున్నారు అని పరిశోధనల్లో తేలింది,
దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు , ఇద్దరికీ ఈ షుగర్ వ్యాధి ఉంటుంది.
ఈ షుగర్ వ్యాధి రావడానికి ప్రధాన కారణాలు ఆహారపు అలవాట్లు, వంశపారంపర్యం , అలాగే ఒబేసిటీ. శారీరిక శ్రమ లేకపోవడం ,
రక్తం లో చక్కర స్థాయిలు పెరగడం వల్ల ఈ షుగర్ వ్యాధి వస్తుంది. మనం తీసుకునే ఆహరం గ్లూకోస్ లా మారుతుంది ,
ఇది అధిక శాతం ఉండటం వల్ల డయాబేటిస్ వస్తుంది . ఇందులో టైపు-1 , టైపు -2 , గెస్టేషనల్ డయాబెటిస్ అనే రకాలు ఉంటాయి .
దీనికి ముఖ్య కారణం క్లోమ గ్రంధి లో బీటా కణాలు పెరిగి గ్లూకోస్ అరికట్టడానికి సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి చేయలేకపోవడం.
టైప్ -1 : బీటా కణాలను స్వయం గా మన శరీరం నాశనం చేయడం వల్ల వస్తుంది.
టైప్ -2 బీటా కణాలు ఇన్సులిన్ నిరోధకతను తట్టుకోలేనపుడు వస్తుంది.
గెస్టేషనల్ డయాబెటిస్ : ఇది సాధారణం గా గర్భం ధరించిన స్త్రీలలో వస్తుంది. కొంత కాలానికి తగ్గిపోతుంది .
డయాబెటిస్ వలన అధిక మూత్ర విసర్జన,అధిక దాహం, కంటి చూపు మందగించడం ,బరువు తగ్గడం ,బద్ధకం గా ఉండటం వంటివి బాధిస్తాయి .
ఈ డయాబెటిస్ అన్ని వయసుల వారికి వచ్చే అవకాశం ఉంది.
ఈ కరేలా జామున్ జ్యూస్ లో
1. కాకరకాయ ,
2. నేరేడు ,
3. ఉసిరి,
4. మెంతి,
5. అల్లం,
6.అశ్వగంధ ,
7.శతావరి మొదలైనవి ఉన్నాయి .
కరేలా ని తెలుగు లో కాకరకాయ అంటారు , డయాబెటిస్ కి కాకరకాయ చక్కటి ఔషధం .
కాకరకాయ
కాకరకాయ లో విటమిన్ ఏ , విటమిన్ సి , విటమిన్ ఈ , విటమిన్ కే ,ఐరన్ , మెగ్నీషియం , ఫాస్పారోస్ , పొటాషియమ్ ,
సోడియం ,జింక్ , పైబర్ తో పాటుగా అనేక పోషక పదార్దాలు ఉన్నాయి .కాకరకాయ లో ఉండే ఫైబర్ జీర్ణ శక్తీ ని మెరుగుపరుస్తుంది .
కాకరకాయ మీ కిడ్నీలు మరియు మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది .
కాకరకాయ ని తీసుకోవడం వల్ల కిడ్నీ లో వచ్చే రాళ్లను కూడా కరిగించుకోవచ్చు .
కాకరకాయ గుండె ను ఆరోగ్యం గా ఉంచుతుంది . శరీరం లో ఉండే చెడు కొలెస్ట్రాల్ వలన రక్తాన్ని గుండెకి చేర్చే ధమనుల్లో ఏర్పడే అవరోధాలను నివారిస్తుంది
షుగర్ వ్యాధి తో బాధపడే వారికి కాకరకాయ ఒక వరం లాంటిది , కాకరకాయ లో ఇన్సులిన్ పోలి ఉండే రసాయనాలు ఉంటాయి . ఇవి రక్తం లో చక్కర స్థాయి ని తగ్గించడానికి సహాయపడతాయి .
నేరేడు ఇష్టపడని వారంటూ ఉండరు , ఔషధపరం గానే కాకుండా మన భారతీయ సంస్కృతి తో కూడా ఎంతో ముడి పడిన నేరేడు .
అప్పట్లో రాముల వారు వనవాసం చేసేటపుడు ఈ నేరేడు పళ్ళ తోనే కడుపు నింపుకునే వారు .
అంతటి మహత్యం కలిగిన నేరేడు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది . అందుకే నేరేడు ను దైవఫలం అంటారు.
నేరేడు
మధుమేహాన్ని నియంత్రిస్తుంది . గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది .
దంత సంరక్షణకు దోహదపడుతుంది . చర్మాన్ని కాంతివంతం చేస్తుంది . డీ హైడ్రేషన్ ను తగ్గిస్తుంది.
రోగనిరోధక శక్తీ ని పెంచుతుంది . కళ్ళను ఆరోగ్యం గా ఉంచుతుంది.
ఎముకలను బలం గా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి ని పెంచుతుంది . జీర్ణ సంబంధ వ్యాధులకు చక్కటి ఉపశమనం . కాలేయం, మూత్ర సంబంధిత సమస్యలు రాకుండా దూరపరుస్తుంది .
నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది.
ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది
నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55 mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
నేరేడులో ఎన్నో మంచి గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే అనేక రోగాలను తట్టుకునే శక్తిని ఇది ఇస్తుంది.
నేరేడు ఇనుము పుష్కలంగా దొరుకుతుంది. శరీరానికి ఎంతో అవసరమైన హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి సాయం చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ దీని పాత్ర అధికం.
వీటిని తినడం వల్ల అజీర్తి సమస్యలు దూరమవుతాయి. ఆహారం బాగా జీర్ణం అవుతుంది. జీవక్రియల రేటు మెరుగుపడుతుంది.
అందాన్ని పెంచడంలోనూ ఇది ప్రత్యేక పాత్ర పోషిస్తుంది దీనిని తరచూ తినడం వల్ల చర్మంపై ముడతలు పడవు. వృద్ధాప్య ఛాయలు కూడా త్వరగా రావు.
తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి.
ఉసిరి
- ఉసిరిని సంస్కృతం లో ‘‘ఇండియన్ గూస్ బెర్రీ లేదా ఆమ్లా “అని అంటారు.
- ఇందులో విటమిన్ “సి” అధికంగా ఉంటుంది. అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఇది షుగర్ నియంత్రణ లో ఉండటానికి ఇది సహాయపడుతుంది.
- ఇందులో విటమిన్ సి అధికం గా ఉండటం వల్ల కంటి సమస్యల రాకుండా నివారిస్తుంది. మనకి రోజుకి 140 mg విటమిన్ సి అవసరం అవుతుంది
- ఉసిరికాయ ఎలా ఉండే క్రోమియం అనే పదార్థం శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను నిరోధిస్తుంది
- ఇది రోగనిరోధక శక్తిని, జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. జలుబు మరియు దగ్గుతో సహా వైరల్ మరియు బ్యాక్టీరియా వ్యాధులను నివారిస్తుంది.గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
- ఉసిరికాయను తిన్నట్లతే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి.ఉసిరికాయను తినడం వల్ల శారీరక బలం పెరుగుతుంది.
- ఉసిరికాయను తీసుకుంటే మేధస్సు పెరుగుతుంది.
వివరాలు పరిమాణం
విటమిన్ A | 0.12% |
విటమిన్ C | 1.32% |
కాల్షియమ్ | 0.50% |
ఐరన్ | 0.20% |
ఎనర్జీ | 1.85 cal |
ప్రోటీన్ | 0.50% |
సోడియం | 1.11% |